కువైట్ లో ఆరోగ్య సంరక్షణకు 'SalemApp'..!!
- November 20, 2025
కువైట్: కువైట్ లో ఆరోగ్య సేవల కోసం సేలం యాప్ ను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ప్రారంభించారు. కొత్త యాప్ హాస్పిటల్, క్లినిక్ అపాయింట్మెంట్లను సులభంగా బుక్ చేసుకోవడం, మెడికల్ రికార్డులను నిర్వహించడం ద్వారా రోగులకు ఆరోగ్య సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
పౌరులు మరియు ప్రవాసులు ఆరోగ్య సేవలను సురక్షితంగా, త్వరగా యాక్సెస్ చేయడానికి మరియు వారి ఆరోగ్య ప్రొఫైల్‌లను సులభంగా నిర్వహించడానికి వీలు కల్పించడంలో సేలం యాప్ కువైట్ 'సెహా' యాప్‌ను రిప్లేస్ చేస్తుందని మంత్రి వెల్లడించారు.
ప్రజారోగ్య కార్యక్రమాలు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, మెడికల్ సేవలు మరియు ఇంట్లో ఆరోగ్య సంరక్షణను కవర్ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాప్ వినియోగాన్ని విస్తరిస్తూనే ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







