ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- November 20, 2025
మస్కట్: బార్కాలోని విలాయత్‌లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వాణిజ్య సంస్థకు ప్రైమరీ కోర్టు భారీ జరిమానా విధించింది. OMR 1,500 హోం అప్లైయిన్స్ తయారీ కోసం ఒక వాణిజ్య సంస్థతో ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడు నెలల్లో పని పూర్తి చేయాలని OMR 700 అడ్వాన్స్ చెల్లించాడు. అయితే, ఆ సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఒక్క వస్తువును కూడా సరఫరా చేయలేదు. చెల్లించిన అడ్వాన్సును కూడా తిరిగివ్వలేదు. దాంతో బాధితుడు సదరు సంస్థపై ఫిర్యాదు దాఖలు చేశాడు.
బార్కాలోని వినియోగదారుల రక్షణ పరిపాలన విభాగం కేసును నమోదు చేసి, తదుపరి విచారణకు ఈ ఫైల్‌ను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పింపించింది.కేసును సమీక్షించిన కోర్టు.. సంస్థ , దాని ఓనర్ కు చెరో OMR 1,000 జరిమానా, కస్టమర్ చెల్లించిన OMR 700 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాలని, అతనికి కలిగిన నష్టాలకు OMR 100 పరిహారంతో పాటు చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!
- ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- కువైట్ లో ఆరోగ్య సంరక్షణకు 'SalemApp'..!!
- ఈ వీకెండ్ ఖతార్‌లో జరిగే స్పెషల్ ఈవెంట్స్..!!
- కొలరాడోలో NATS ప్రస్థానానికి శ్రీకారం
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ







