భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్

- November 20, 2025 , by Maagulf
భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్

తిరుమల: భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు విజ్ఞప్తి చేశారు.

Global Hindu Heritage Foundation, http://savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com