దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!
- November 20, 2025
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లో గురువారం ఉదయం కార్యకలాపాలకు దట్టమైన పొగమంచు కారణంగా అంతరాయం కలిగింది. దాదాపు 19 ప్లైట్స్ ను దారి మళ్లించారు.లో విజిబిలిటీ కారణంగా పలు సర్వీసులను దారి మళ్లించినట్లు దుబాయ్ ఎయిర్ పోర్టు తెలిపింది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు తమ విమానయాన సంస్థ అప్టేడ్ లను తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది.
అంతకుముందు, షార్జా ఎయిర్ పోర్టులో కూడా ఇదే సమస్య తలెత్తింది. పోగమంచు కారణంగా పలు విమాన సర్వీసుల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. విమానాశ్రయానికి వచ్చే ముందు తమ విమానాల స్టేటస్ ను ధృవీకరించుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని కోరింది.
ప్రస్తుతం యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో భయంకరమైన పొగమంచు ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు.ఈ సమయంలో హారిజంటల్ విజిబిలిటీ 500మీటర్ల కంటే తక్కువకు పడిపోతుందని హెచ్చరించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) దుబాయ్, అబుదాబి, షార్జా మరియు అజ్మాన్ అంతటా రెడ్ అలర్ట్ లను జారీ చేసింది.
తాజా వార్తలు
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!
- ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- కువైట్ లో ఆరోగ్య సంరక్షణకు 'SalemApp'..!!
- ఈ వీకెండ్ ఖతార్లో జరిగే స్పెషల్ ఈవెంట్స్..!!
- కొలరాడోలో NATS ప్రస్థానానికి శ్రీకారం
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ







