సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- November 21, 2025
పుట్టపర్తి: పాల్గొన్న 125 దేశాల ప్రతినిధులు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి సేవా సంస్థల 11వ ప్రపంచ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ వేడుకలకు కేంద్ర జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సదస్సు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి ప్రశాంతి నిలయం చేరుకున్న ప్రతినిధులు వారి దేశ పతాకాన్ని చేత పట్టుకొని సత్యసాయి మహాసమాధి చెంతకు ఊరేగింపుగా వచ్చి దర్శనం చేసుకున్నారు. అనంతరం ధన్యవాదములు శ్రీ సత్యసాయి అనుగీతాన్ని బృందంగా చేరి ఆలపించారు.
10 జోన్ల నుండి 135 దేశాల ప్రతినిధులు
అనంతరం సదస్సు కార్యాచరణను మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, ట్రస్టు సభ్యులు ఎస్ఎస్ నాగనంద్, డాక్టర్ మోహన్లతో కలిసి ప్రారంభించారు. స్వాగత ఉపన్యాసాన్ని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఎస్. ఎస్.నాగానంద్ మాట్లాడుతూ శతవర్ష జన్మదిన వేడుకలలో భాగంగా నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రాంలో యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పీజీ, నేపాల్, శ్రీలంక, చైనా, జపాన్, ఇండోనేషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మొదలకు దేశాలలో సేవాదళ్ సభ్యులు ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలలో, ప్రకృతి విలయ సమయాలలో అనేక సేవలను నిర్వహిస్తున్నారన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్య మాట్లాడుతూ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ పరిధిలోని 10 జోన్ల నుండి 135 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు.
విదేశాల నుండి దాదాపు 3000 మంది
అనంతరం ముఖ్య అతిథి అయిన నితిన్ గడ్కరీ పాల్గొని సత్యసాయి చేస్తున్న నిస్వార్థ సేవలను గురించి ప్రసంగించారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు సత్య కుమార్ యాదవ్, సవితమ్మ, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈ సదస్సు పూర్ణచంద్ర ఆడిటోరియంలో కొనసాగింది. ఈ సదస్సుకు విదేశాల నుండి దాదాపు 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం సాయి కుల్వంత్ సభ మండపంలో గ్లోబల్ కౌన్సిల్ పరిధిలోని యువతి యువకులు అద్భుతమైన సంగీత గాన కచేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూరోప్ భక్తులు ఆలపించిన “శివ.. శివ.. శివ… వినరాద.. అను గీతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







