ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!

- November 21, 2025 , by Maagulf
ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!

దోహా: ఖతార్ లో నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ (NCD) స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత మందికి చేరువ చేసేందుకు వీలుగా కేంద్రాలను పెంచనున్నారు. ముందస్తు గుర్తింపు, ఆరోగ్య సంరక్షణ మరియు దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఇవి దోహదం చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఖతార్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నవంబర్ ఎడిషన్‌లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. 

నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్‌ అనేది ప్రారంభ దశల్లో వ్యాధులను గుర్తించడంలోనే కాకుండా జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, సమస్యలను తగ్గించడంలో మరియు అకాల మరణాలను నివారించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.  ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) నివేదికలు మరియు స్థానిక అధ్యయనాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 

2017లో ఖతారీ వాసులకు వార్షిక ఆరోగ్య తనిఖీలు ప్రవేశపెట్టారు. 2022లో ప్రీడయాబెటిస్, రక్తపోటు మరియు ఒబెసిటీ వంటి లైఫ్ స్టైల్ డిజిజెస్ ను గుర్తించడానికి విస్తరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.   2024లో 79.5శాతానికి స్క్రీనింగ్ కవరేజ్ పెరిగింది. రాబోయే రోజులలో మరింత మందికి ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వీలుగా కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు ఖతార్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com