పబ్లిక్ హెల్త్ ప్రమోషన్‌లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!

- November 21, 2025 , by Maagulf
పబ్లిక్ హెల్త్ ప్రమోషన్‌లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!

కువైట్: ది అవెన్యూస్ మాల్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రపంచ డయబెటిక్ దినోత్సవ కార్యక్రమానికి జైన్ కువైట్ మద్దతు ఇచ్చింది. అల్-అమిరి హాస్పిటల్‌లో ఎండోక్రినాలజీ మరియు డయాబెటిస్ విభాగం నిర్వహించిన 'బెటర్ హెల్త్ విత్ డయాబెటిస్' అనే ఆరోగ్య అవగాహన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్వహాబ్ అల్-అవధి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జైన్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఆరోగ్య సంబంధిత అవగాహనను పెంపొందించడాన్ని అభినందించారు. దీర్ఘకాలిక వ్యాధులు మరియు నివారణ పద్ధతులపై అవగాహన పెంచుతుందని ప్రశంసించారు.  కమ్యూనిటీ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు జీవన నాణ్యతకు సంబంధించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక భాగస్వామిగా ప్రైవేట్ రంగం ఎనలేని సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో అల్-అమిరి హాస్పిటల్‌లోని ఎండోక్రినాలజీ మరియు డయాబెటిస్ డిపార్ట్‌మెంట్ బృందం సభ్యులు పాల్గొన్నారు.  ఉచిత వైద్య పరీక్షలను అందించారు. డయబెటిస్ నివారణ, చికిత్స మరియు సరైన నిర్వహణ గురించిన అవగాహన కల్పించారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com