బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!

- November 21, 2025 , by Maagulf
బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!

మనామా: బహ్రెయిన్ లోని నువైద్రాట్‌లో ఒక పిల్లవాడిని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. అతనిపై కేసు నమోదు చేసి,  చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

అదే విధంగా, బుసైతీన్ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నట్లు వైరల్ వీడియోలోని డ్రైవర్‌పై అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ తెలిపింది.  అతని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. 

అలాగే, సిత్రాకు తూర్పున ఉన్న బహ్రెయిన్ ఫోరమ్స్ ప్రాంతంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 31 మరియు 29 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ఆసియా జాతీయులు మరణించారు. వారి మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

సఖిర్‌లో లో జరిగిన మరో సంఘటనలో ట్రక్కు మరియు మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటార్‌సైకిలిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడని జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ చట్టాలు మరియు స్పీడ్ లిమిట్స్ ను పాటించాలని కోరింది.   

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com