మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- November 21, 2025
మయన్మార్లో(AP) సైబర్ నేరగాళ్ల పంజా చిక్కి మోసపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 55 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.భారత ప్రభుత్వం వారి రక్షణ కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, థాయ్లాండ్ మార్గం ద్వారా వీరిని ఢిల్లీలోకి తరలించింది. మొత్తం 370 మంది భారతీయులు స్వదేశానికి తీసుకువచ్చబడినందులో 55 మంది ఏపీకి చెందినవారు.
ఢిల్లీ విమానాశ్రయంలో భారత ప్రభుత్వ అధికారులు బాధితులను ఏపీ భవన్ సిబ్బందికి అప్పగించి, తక్షణమే తాత్కాలిక వసతి, భోజన సౌకర్యాలను అందించారు. మయన్మార్లో మోసపోయిన వ్యక్తులు మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకోలేక ఇబ్బందిలో ఉన్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి బాధితునికి రూ. 1,000 ఆర్థిక సహాయం అందించింది.
తదుపరి, రైల్వే అధికారులతో సమన్వయం చేసి, ఎమర్జెన్సీ కోటాలో టిక్కెట్లు కేటాయించారు. బాధితులు తమ స్వస్థలాలకు రైళ్ల(AP) ద్వారా ప్రయాణం ప్రారంభించారు. కష్టకాలంలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 24 మంది వ్యక్తులను ప్రభుత్వం రక్షించగా, తాజా ఆపరేషన్తో మయన్మార్లో సైబర్ నేరగాళ్ల నుండి రక్షించబడిన ఆంధ్రప్రదేశ్ వాసుల సంఖ్య 79కి చేరింది.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







