Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?

- November 21, 2025 , by Maagulf
Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?

యూఏఈ: యూఏఈలో పర్సనల్ లోన్లకు  Dh5,000 మినిమం సాలరీ నిబంధనను తొలగించింది. అయితే,ఈ నిర్ణయాన్ని అధికారికంగా గుర్తించినా, అందరికి పర్సనల్ లోన్లు లభించడం అంత సులువు కాదని యూఏఈ  బ్యాంక్స్ ఫెడరేషన్ (UBF) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

అంతకుముందు లక్షలాది మంది తక్కువ ఆదాయ నివాసితులకు క్రెడిట్ యాక్సెస్‌ను విస్తృతం చేయడానికి యూఏఈ సెంట్రల్ బ్యాంక్ పర్సనల్ లోన్లకు కనీస జీతం Dh5,000 నిబంధనను రద్దు చేసింది.  అయితే, ఇది చాలా సానుకూల పరిణామమని, ఇది ఆర్థిక ఎదుగుదలకు మద్దతు ఇస్తుందని, కానీ ఆర్థిక సంస్థలు ఎలాంటి రుణాలు ఇవ్వాలనుకుంటున్నాయో నిర్ణయించుకోనివ్వాలని యుబిఎఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అల్-ఘురైర్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.  

కాగా, దేశంలో కొత్త నిర్ణయంతో మొత్తం లేబర్ ఫోర్స్ వ్యక్తిగత రుణాలకు అర్హులు ఆయన అన్నారు.  అయితే, చాలా మంది బ్లూ-కాలర్ కార్మికులు బ్యాంకులకు రిస్క్ ఫ్యాక్టర్‌ను పెంచుతారని అభిప్రాయపడ్డారు.  కానీ, అందరూ అర్హులైనా.. అందరికి లోన్లు వస్తాయో లేదో చెప్పలేమని, అది బ్యాంకుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని మష్రెక్ బ్యాంక్ చైర్మన్ కూడా అయిన అల్-ఘురైర్ తెలిపారు. 3,000 దిర్హామ్‌ల నుండి 4,000 దిర్హామ్‌ల వరకు సంపాదించే డ్రైవర్ ఏ రుణం తీసుకోగలడు? పైగా అలాంటి ఉద్యోగాలు అస్థిరమైనవి మరియు ప్రమాదకరమైనవి. వారు ఎప్పుడైన తమ ఉద్యోగాలను కోల్పోతారు. 2,000 దిర్హామ్‌ల వరకు రుణం పొందే రైతుకు మనం రుణం ఇస్తుంటే, అతను వారు లోన్లను తిరిగి కట్టకపోతే, అప్పుడు బ్యాంకులు ఏమి చేయాలి? అధిక రిస్క్ ఛార్జ్ కారణంగా బ్యాంకులు దివాళా లేదా నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు.  

అయితే, వ్యక్తిగత రుణాల కోసం 5,000 దిర్హామ్‌ల నిబంధనను తొలగించాలనే నిర్ణయం.. నాన్ బ్యాంకింగ్ మార్కెట్‌ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుందని ఎమిరేట్స్ ఇస్లామిక్ డిప్యూటీ సీఈఓ మహ్మద్ కమ్రాన్ వాజిద్ అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com