ఏపీ ప్రజలకు శుభవార్త..

- November 21, 2025 , by Maagulf
ఏపీ ప్రజలకు శుభవార్త..

అమరావతి: ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు నూతన సంవత్సరం కానుకగా సంజీవని పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించబోతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు  వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో పైలెట్‌గా కుప్పంలో అమలు చేసిన ప్రాజెక్టు వివరాలు తెలుసుకుని, అదే విధానాన్ని జిల్లా మొత్తంలో అమలు చేయాలని ఆదేశించారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన ప్రభుత్వం కలిగి ఉంది.

సంజీవని పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనున్నారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఈ సౌకర్యం లభిస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద సుమారు 3,250 రకాల చికిత్సలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. తొలి దశలో రూ.2.50 లక్షల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం భరిస్తుంది, ఆ మొత్తాన్ని మించితే ట్రస్టు ద్వారా పూర్తి చికిత్స అందించబడుతుంది.

సమీక్ష సందర్భంగా సీఎం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల పురోగతిని కూడా పరిశీలించారు. మదనపల్లి, మార్కాపురం, ఆదోని, పులివెందులలో పీపీపీ విధానంలో జరుగుతున్న నిర్మాణాలు గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే సంజీవని పథకం ప్రధాన లక్ష్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com