డిసెంబర్ 6న జెడ్డాలో రెడ్ సీ మ్యూజియం ప్రారంభం..!!
- November 22, 2025
రియాద్: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హిస్టారిక్ జెడ్డాలో డిసెంబర్ 6న రెడ్ సీ మ్యూజియం ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా మ్యూజియం కమిషన్ ప్రకటించింది.
రెడ్ సీ సాంస్కృతిక మరియు సహజ వారసత్వంతోపాటు సౌదీ అరేబియా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలయజేసేలా ఈ మ్యూజియం పనిచేస్తుందని సాంస్కృతిక మంత్రి మరియు మ్యూజియంల కమిషన్ ఛైర్మన్ ప్రిన్స్ బదర్ బిన్ ఫర్హాన్ తెలిపారు. అన్ని వయసుల వారికి అనుగుణంగా కంటెంట్ ను మ్యూజియం అందజేస్తుందన్నారు.
ఈ చారిత్రక మ్యూజియం నేల, సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్న చారిత్రాత్మక బాబ్ అల్-బంట్ భవనంలో ఉంది. వారసత్వ పరిరక్షణ కోసం అత్యున్నత పర్యావరణ ప్రమాణాల ప్రకారం ఈ భవనాన్ని పునరుద్ధరించారు.
ఈ మ్యూజియంలో అరుదైన కళాఖండాలు మరియు వారసత్వ వస్తువుల విస్తృత సేకరణ ఉంది. వీటిలో చైనీస్ సిరామిక్స్, ధూపం బర్నర్లు, పగడపు ముక్కలు, ఆభరణాలు, నావిగేషన్ పరికరాలు, మ్యాప్స్, మాన్యుస్క్రిప్ట్‌లు మరియు ఆర్కైవల్ ఫోటోలు, సౌదీ మరియు అంతర్జాతీయ కళాకారుల ఆధునిక మరియు సమకాలీన కళాకృతులు ఉన్నాయి.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







