కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- November 22, 2025
కువైట్: కువైట్ లో విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షక ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్కరణలపై చర్చించడానికి కువైట్ విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వైస్-ప్రిన్సిపాల్, డిపార్ట్‌మెంట్ హెడ్ మరియు కిండర్ గార్టెన్ సూపర్‌వైజర్ వంటి పోస్టులను త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేయనుంది.అనేకమంది టీచర్లు ప్రమోషన్ల కోసం గత ఆరేండ్లుగా వేచి ఉన్నారు.ఈ క్రమంలో తొలుత ప్రమోషన్లు ఇవ్వాలని, ఆ తర్వాతనే డైరెక్టు రిక్రూట్ మెంట్ కు పోవాలని పలువురు సూచించారు.
అయితే, కొన్ని సబ్జెక్టులలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉండటంతో చర్చల్లో స్పష్టత కోసం ప్రయత్నించినట్ల ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. అలాగే, కిండర్ గార్టెన్లలో పర్యవేక్షక పోస్టులకు భారీ డిమాండ్ ఉందన్నారు.కాగా, కప్యూటర్ బేస్డ్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, సర్వీస్ రికార్డు, అనుభవం ఆధారంగా కొత్త పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విద్యా మంత్రి జలాల్ అల్-తబ్తబాయి పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు ఈ కొత్త విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై పలు ఉపాధ్యాయ సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి.
తాజా వార్తలు
- డిసెంబర్ 6న జెడ్డాలో రెడ్ సీ మ్యూజియం ప్రారంభం..!!
- కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- నూర్ ల్యాండ్ టాయ్స్ తో RHF యూనివర్సల్ చిల్డ్రన్స్ డే..!!
- దుబాయ్ లో 210 మోటార్బైక్లు, స్కూటర్లు సీజ్..!!
- రువాండాలో అమీర్ పర్యటన విజయవంతం..!!
- అల్ అమెరాట్ మరణాల పై విద్యుత్ శాఖ క్లారిటీ..!!
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం







