నైజీరియాలో 215 మంది విద్యార్థుల కిడ్నాప్..
- November 22, 2025
నైజీరియాలో క్రైస్తవుల హింస రోజురోజుకు పెరిగిపోతున్నది.వారి పై ఊచకోతకు పాల్పడుతున్నారు. క్రైస్తవుల్ని కిడ్నాప్ చేయడం, వారిని హింసించడం, లైంగిక దాడులు చేయడం, హతమార్చడం అక్కడి టెర్రరిస్టుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీంతో నైజీరియాలో సాయుధుల కిడ్నాప్ ల పరంపర ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే 25 మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు..తాజాగా 215 మంది చిన్నారులను,12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు.ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన నైజీరియా సర్కారు 47 కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆఫ్ నైజీరియా ప్రకారం నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఈ అపహరణ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, తుపాకులు చేత పట్టుకుని వచ్చి మరీ పిల్లలను కిడ్నాప్ చేశారు. కేవలం విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను సైతం అపహరించారు. మొత్తం 215 మంది విద్యార్థులను, 12మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. అదృష్టవశాత్తు కొందరు పిల్లలు అపహరణకు గురి కాకుండా తప్పించుకోగలిగారని సీఏఎన్ ఛైర్మన్ రెవరెండ్ బులుస్ దౌవా యోహన్నా తెలిపారు. అయితే 2024 మార్చిలో కడువా రాష్ట్రంలో 200మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేసినప్పటి నుంచి జరిగిన అతిపెద్ద సామూహిక పాఠశాల అపహరణ ఇది.
సోమవారం కెబ్బి రాష్ట్రంలోని ఒక బోర్డింగ్ పాఠశాల నుంచి 25 మంది బాలికలను సాయుధులు అపహరించారు. అదే రోజున ద్వారా రాష్ట్రంలో ఒక చర్చిపై దాడి చేసి 38 మంది భక్తులను కిడ్నాప్ చేసి.. వారిని విడుదల చేసేందుకు డబ్బులు అడిగారు. ఒక్కో భక్తుడికి రూ. 61, 69, 348 చొప్పున డిమాండ్ చేసినట్లు చర్చి అధికారులు తెలిపారు.
నైజీరియాలో భద్రత సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ దేశంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియన్ల హత్యలకు అరికట్టడంలో విఫలమైతే వెంటనే సైనిక చర్య తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.ఈ హెచ్చరిక తర్వాత పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్ సెత్ నైజీరియా జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమై క్రిస్టియన్లపై జరుగుతున్న హింస గురించి చర్చించారు. ఈవిధంగా దొరికిన వారిని దొరికినట్లుగా ముఠాలు అపహరణ చేస్తూ, వారి ఆస్తులతో పాటు, తీవ్ర మానవ హింసకు పాల్పడుతున్నది.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







