అల్ మషాఫ్ హెల్త్ సెంటర్‌లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- November 22, 2025
దోహా: ఖతార్ లో నేషనల్ హెల్తీ ఏజింగ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించనున్నారు. ఇందులో భాగంగా అల్ మషాఫ్ హెల్త్ సెంటర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ కేర్ ఫర్ ఓల్డర్ పీపుల్ (ICOPE) క్లినిక్‌ను ప్రారంభించారు. వృద్ధులకు అవసరమైన ప్రత్యేక సేవల కోసం నెట్‌వర్క్ క్లినిక్ లను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్లినిక్ లు రుమైలా హాస్పిటల్‌లోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోలరేటింగ్ సెంటర్ ఫర్ హెల్తీ ఏజింగ్ అండ్ డిమెన్షియా కింద పనిచేస్తాయి.
ఖతార్ మిడిలీస్టులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICOPE ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసిన మొదటి దేశంగా నిలిచింది. ఇది వృద్ధులలో ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించడంలో మద్దతు ఇస్తుంది, వృద్ధుల జీవన నాణ్యతను పెంచుతుంది.
ఏప్రిల్ 2023లో అల్ వాజ్‌బా హెల్త్ సెంటర్‌లో మొదటి క్లినిక్‌ను ప్రారంభించారు. అనంతరం రావ్దత్ అల్ ఖైల్, లీబైబ్, ఖతార్ యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రాలలో క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్‌లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







