సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- November 22, 2025
మనామా: బహ్రెయిన్ లో హ్యాండ్, ఫుట్, మౌత్ డిసిజెస్ (HFMD) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నర్సరీలు, కిండర్ గార్టెన్లు మరియు ప్రాథమిక పాఠశాలల్లో కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నాయి. పిల్లలలోనే అధిక కేసులు ఉన్నప్పటికీ, కోవిడ్ తర్వాత పెద్దలలో కూడా ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ జైనాబ్ అల్మోసాలి తెలిపారు.
HFMD అనేది కాక్స్సాకీవైరస్ A16 వల్ల కలిగే సాధారణ వైరల్ అనారోగ్యం. వైరస్ సోకిన 3–6 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా జ్వరం, నోటిలో పుండ్లు మరియు అరచేతులు, అరికాళ్ళు మరియు కొన్నిసార్లు పిరుదులపై దద్దుర్లు లేదా చిన్న బొబ్బలు కనిపిస్తాయని అన్నారు. సాధారణంగా అక్టోబర్ - నవంబర్‌లో కేసులు గరిష్టంగా ఉంటాయని, డిసెంబర్ నాటికి కేసుల తీవ్రత తగ్గుతాయని పేర్కొన్నారు.
అయితే, మొదటి వారంలో బొబ్బల ద్వారా ఏర్పడే లిక్విడ్ మరియు చేతి స్పర్శ ద్వారా HFMD వ్యాప్తి చేందుతుందన్నారు. దద్దుర్లు తగ్గిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగుతుందని డాక్టర్ జైనాబ్ హెచ్చరించారు. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని మరియు కాలానుగుణ సమయంలో వ్యాప్తిని అరికట్టడానికి పరిశుభ్రత చర్యలను పాటించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







