'అంపశయ్య’ కోసం నగ్న దృశ్యాలు చిత్రీకరించిన మాట వాస్తవమే
- July 25, 2016
‘అందరూ ఆర్ట్ ఫిల్మ్ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్ ఫిల్మ్ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం’’ అని దర్శకుడు ప్రభాకర్ జైని అన్నారు. ‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘క్యాంపస్–అంపశయ్య’. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. ప్రభాకర్ జైని, విజయలక్ష్మి జైని ప్రధాన పాత్రలు పోషించారు. ప్రత్యేక పాత్రలో ఆకెళ్ల రాఘవేంద్ర నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ – ‘‘నవలలో బోల్డ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఆధారంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది. కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. పాత్రధారుల భావోద్వేగాలు మాత్రమే కనిపిస్తాయి. వ్యాపారాత్మక దృక్పథంతో, కమర్షియల్ ఫార్మాట్లో తీసే ఉద్దేశం లేదు. సాధ్యమైనంత వరకూ 1965–70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది. ఇటీవల చిత్రం చూసిన పలువురు సినీ ప్రముఖులు మంచి ప్రయత్నమంటూ ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
మోనికా థాంప్సన్, శరత్, యోగి, దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతీ నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.




తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







