ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!

- November 23, 2025 , by Maagulf
ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!

మస్కట్: అమెరికా డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రూపాయి విలువ 89.48 కి చేరుకొని జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. గత మూడు నెలల్లో ఇది అత్యధిక సింగిల్ డే పతనం అని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. ఒమన్‌లో రియాల్‌తో పోలిస్తే భారత రూపాయి 232.25కి చేరిందని ఆర్థికరంగ నిపుణుడు ఆర్. మధుసూదనన్ చెప్పారు. 2025లో భారత రూపాయి విలువ దాదాపు 4.5 శాతం తగ్గిందని అన్నారు.  

 భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) GDPలో 1.7 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎగుమతి ఆదాయాలు ప్రభావితమవడం మరియు ముడి చమురుతో పాటు బంగారం మరియు వెండి దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణం అని వెల్లడించారు.  అయితే, రాబోయే రోజుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తే భారత రూపాయి బలపడే అవకాశం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com