పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?

- November 23, 2025 , by Maagulf
పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?

దుబాయ్: యూఏఈలో ఉద్యోగికి సురక్షితమైన మరియు సముచితమైన పని వాతావరణాన్ని అందించడం యజమాని బాధ్యత.  ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 14(2) లైంగిక, మౌఖిక, శారీరక మరియు మానసిక వేధింపులతో సహా వివిధ రకాల వేధింపులను స్పష్టంగా నిషేధిస్తుంది. ఈ రకమైన వేధింపులు యజమానులు, ఉన్నతాధికారులు, సహోద్యోగులు లేదా బాధిత ఉద్యోగితో పనిచేసే ఎవరి నుండి అయినా రావచ్చని నిపుణులు తెలిపారు.   

ఉద్యోగి పట్ల యజమాని అగౌరవంగా ప్రవర్తిస్తే.. లేదా ఇతరుల సమక్షంలో మిమ్మల్ని కించపరిచేలా భాషను ఉపయోగిస్తుంటే లేదా అరుస్తుంటే, అతనికి కనీసం 6 నెలల జైలు శిక్ష లేదా Dh5,000 వరకు జరిమానా విధించేలా యూఏఈలో అమల్లో ఉన్న చట్టంలో పేర్కొన్నారు. దీంతోపాటు నేరుగా మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని హెచ్ నిపుణులు వెల్లడించారు.  

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com