కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- November 24, 2025
యూఏఈ: కేరళకు చెందిన ఓ మహిళ వివాహానికి ముందు యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రి పాలైంది. కొచ్చిలోని VPS లేక్‌షోర్ హాస్పిటల్‌లోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ.. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం వివాహం చేసుకుంది. ఈ ఆస్పత్రి వెడ్డింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో VPS లేక్‌షోర్ హాస్పిటల్ ఛైర్మన్ , యూఏఈకి చెందిన డాక్టర్ షంషీర్ వాయలీల్ ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆయన మద్దతుతో ఆమెకు వెన్నెముక ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
అంతకుమందు డాక్టర్ షంషీర్, 23 ఏళ్ల అవని వైద్య సంరక్షణ పూర్తి ఖర్చులను భరించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. అవని కోలుకునేంత వరకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ షంషీర్ కు అవని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని ఇంటర్ సెక్షన్ మూసివేత..!!
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం







