కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- November 24, 2025
కువైట్: కువైట్ లో విదేశీయుల నివాస చట్టం నిబంధనలను అంతర్గత మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎంట్రీ వీసాలు, రెసిడెన్సీ వీసాలు మరియు రకాలు, స్పాన్సర్లు మరియు యజమానులకు వర్తించే నిబంధనలను వివరించారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు మరియు విదేశీ విద్యార్థులకు నివాస అనుమతులు (ఆర్టికల్ 17, 18, 23) కోసం 20 KD ఫీజుగా నిర్ణయించారు. అలాగే, విదేశీ భాగస్వాములకు నివాస అనుమతులు (ఆర్టికల్ 19), పెట్టుబడిదారులు (ఆర్టికల్ 21), మరియు ప్రాపర్టీ యజమానులకు (ఆర్టికల్ 25) కోసం 50 KDగా నిర్ధారించారు. సెల్ఫ్-స్పాన్సర్లకు నివాస అనుమతుల (ఆర్టికల్ 24) కోసం 500 KD నిర్ణయించారు.
విదేశీ పాస్‌పోర్ట్‌లు పొందిన చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారికి, గతంలో అక్రమ నివాసితులుగా జాబితా చేయబడిన రిటైర్డ్ సైనిక సిబ్బందికి మరియు విదేశీ అమరవీరుల కుటుంబాలకు నివాస అనుమతుల (ఆర్టికల్ 30) కోసం 20 KD ఫీజుగా పేర్కొన్నారు.
అదే విధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కార్మికులపై ఆధారపడిన వారికి 20 KDలు, సెల్ఫ్-స్పాన్సర్ల ఆధారపడిన వారికి 100 KDలుగా నిర్ధారించారు. విదేశీయులు కువైట్‌లోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ లేదా విదేశాలలో సంబంధిత కువైట్ అధికారులు ఆమోదించాల్సి ఉంటుంది. వీసా రకాలను బట్టి 15 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం కల్పించారు.
మినిమం 800 KD సాలరీ ఉన్నవారు తమ ఫ్యామిలీని స్పాన్సర్ చేయవచ్చు. అయితే, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, జర్నలిస్టులు మరియు క్రీడా నిపుణులు వంటి అనేక వృత్తిపరమైన వర్గాలకు మినహాయింపులు ఇచ్చారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!







