2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’

- November 24, 2025 , by Maagulf
2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తాజా G20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.G20 సదస్సు లో “అందరికీ న్యాయమైన భవిష్యత్తు” అనే అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2026 ఫిబ్రవరిలో “సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ” అనే నినాదంతో భారత్ ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌’కు ఆతిథ్యం ఇవ్వనుందని, ఈ సదస్సులో పాల్గొనాలని G20 దేశాలను ఆహ్వానించారు.

కృత్రిమ మేధ (AI) విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని నొక్కి చెప్పారు.సదస్సు నిర్వాహక దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. భారత్‌కు చీతాలను తరలించినందుకు రమఫోసాకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com