సౌదీ లో 431 మంది ఉగ్రవాదులు అరెస్ట్

- July 18, 2015 , by Maagulf
సౌదీ లో 431 మంది ఉగ్రవాదులు అరెస్ట్

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు అనుబంధగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక సంస్థను సౌదీ పోలీసులు గుర్తించారు. ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటున్న 431 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువశాతం సౌదీవాసులే ఉన్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. గత కొన్ని వారాలుగా వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు ఆ సంస్థను.. అందులోని సభ్యులను అరెస్ట్ చేసి వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. 

 

--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com