పూరిసేతుపతి షూటింగ్ పూర్తి
- November 25, 2025
వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ #పూరిసేతుపతి షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్ కి సంబధించిన వీడియోను టీం విడుదల చేసింది
వీడియోలో, పూరి, మొత్తం యూనిట్‌తో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి తెలియజేస్తూ, ఈ ప్రయాణాన్ని మెమరబుల్, ఆనందకరమైన అనుభవంగా చెప్పారు. పూరి, చార్మీ తమ భావాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన బాండింగ్ ని తెలియజేశారు. విజయ్, పూరి జాకెట్ చాలా బావుందని అభినందించడం ఫేర్ వెల్ కు ఫన్ టచ్ ని జోడించింది.
ఈ చిత్రాన్ని జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మాజీ , విటివి గణేష్ హిలేరియస్ పాత్రల్లో కనిపిస్తారు.
మొత్తం షూటింగ్ పూర్తయినందున, చిత్ర బృందం ప్రమోషన్లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో విడుదలకు సిద్ధమవుతున్నందున ఈ సిమిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల,
సమర్పణ: ఛార్మి కౌర్
బ్యానర్లు: పూరి కనెక్ట్స్,
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ప్రవాస కార్మికుల నైపుణ్యాల మెరుగు పై సమీక్ష..!!
- విజిట్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చా?
- కేరళ-యూఏఈ విమానం దారి మళ్లింపు..!!
- కటారా ఫాల్కన్రీ, హంటింగ్ ఛాంపియన్షిప్..!!
- ఒక నెలలో 300 మందిని బహిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో పౌరులు, నివాసితుల సెలవుల ప్రణాళికలు..!!
- 48 గంటల్లో కొత్త తుఫాన్?
- సీఎం చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్‌లో మార్పులు అవసరం
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు







