అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- November 25, 2025
మస్కట్: ఇథియోపియాలోని హేలి గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిదకు సంబంధించి ఒమన్ పర్యావరణ అథారిటీ అలెర్ట్ జారీ చేసింది.ఈ ప్రాంతంలో అగ్నిపర్వత కార్యకలాపాల తర్వాత పరిస్థితిని పర్యవేక్షించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ, పౌర విమానయాన అథారిటీతో నిరంతరం టచ్ ఉండి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు అథారిటీ స్పష్టం చేసింది.
పౌర విమానయాన అథారిటీ నుండి వచ్చిన డేటా ప్రకారం, ఎంప్టీ క్వార్టర్‌లోని కొన్ని ప్రాంతాలు మరియు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై 35వేల అడుగుల ఎత్తులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మేఘాలు ఏర్పడ్డాయని, అయితే, ఇప్పటివరకు వీటి కారణంగా ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
మరోవైపు సుల్తానేట్ అంతటా వాయు కాలుష్య స్థాయిలు స్థిరంగా ఉన్నాయి.. వీటిల్లో పెరుగుదల నమోదు కాలేదని పర్యావరణ పర్యవేక్షణ బృందాలు వెల్లడించాయి. అధిక ఎత్తులో ఉన్న బూడిద కారణంగా ప్రజారోగ్యానికి లేదా పర్యావరణానికి తక్షణ ముప్పు లేదని పేర్కొన్నాయి. ఒమన్ వాతావరణం భద్రత మరియు నాణ్యతను నిర్ధారించడానికి ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షణను కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







