ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- November 25, 2025
దోహా: ప్రపంచవ్యాప్త ఔట్రీచ్ వ్యూహంలో భాగంగా ఖతార్ మరియు మిడిలీస్టుతో బలమైన పర్యాటక సహకారం కోసం గోవా రెడీగా ఉందని గోవా ప్రభుత్వ పర్యాటక మంత్రి హెచ్ఈ రోహన్ ఎ ఖౌంటే స్పష్టం చేశారు. ఖతార్ ట్రావెల్ మార్ట్ (QTM) 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏడాది పొడవునా పర్యాటక గమ్యస్థానంగా గోవా ఆకర్షణ పెరుగుతుందని తెలిపారు.
అలాగే, ఖతార్ పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందడాన్ని ఖౌంటే ప్రశంసించారు. QTMలో పాల్గొనడం వల్ల గోవాకు ఖతార్ పర్యాటక, ప్రయాణ రంగంతో భాగస్వామ్యాలను మరింతగా పెంచుకునే అవకాశం లభించిందని, రెండు గమ్యస్థానాల మధ్య బలమైన కనెక్టివిటీకి మద్దతు ఇస్తుందని మంత్రి అన్నారు.
ఈ సంవత్సరం QTMలో గోవా ప్రతినిధి బృందంలో హోటళ్ళు, ట్రావెల్ ఆపరేటర్లు మరియు పర్యాటక సేవలు వంటి మొత్తం ఎనిమిది రంగాలకు చెందని ఇండస్ట్రీ నిపుణులు పాల్గొంటున్నారు. 2025–2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, గోవా పర్యాటక వ్యూహానికి పదును పెడతున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్‌లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!







