డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- November 25, 2025
యూఏఈ: ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఒత్తిడిలో ఉన్నందున వచ్చే నెలలో యూఏఈలో పెట్రోల్ ధరలు కొంచెం తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్లో బ్రెంట్ సగటు ముగింపు ధర $65.22తో పోలిస్తే నవంబర్లో బ్యారెల్కు దాదాపు $63.7గా ఉంది.ఈ లెక్కన రిటైల్ ఇంధన ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, అధికారికంగా ఇంధన ధరలు అధికారికంగా ఈ వారం చివరిలో ప్రకటన వెలువడుతుంది.
యూఏఈలో నవంబర్ నెలలో లీటరుకు దాదాపు 14-15 ఫిల్స్ ధరలను తగ్గించింది.సూపర్ 98, స్పెషల్ 95 మరియు E-ప్లస్ 91 అడ్నాక్, ఎమారత్ మరియు ఎనోక్ పెట్రోల్ స్టేషన్లలో లీటరుకు Dh2.63, Dh2.51 మరియు Dh2.44 ధరలకు అమ్ముతున్నారు. యూఏఈలో గత రెండు నెలలుగా పెట్రోల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
మరోవైపు, యూఎస్-ఉక్రెయిన్ చర్చల ఊగిసలాట ముడి చమురు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని, అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు 48 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురు సముద్రంలో నిలిచిపోయిందని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా తెలిపారు.
తాజాగా రెండు రష్యన్ చమురు దిగ్గజ కంపెనీలపై అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చాయని, అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శాంతి ప్రణాళికపై చర్చించడానికి అంగీకరించడం సానుకూల అంశంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రపంచ విపణిలోకి చమురు సరఫరా పెరిగి, ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విజయ్ వాలెచా విశ్లేషించారు.
తాజా వార్తలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం
- ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్...
- అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..
- డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు







