హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- November 25, 2025
జెడ్డా: ఇథియోపియాలోని హైలే గోబీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీని నుంచి భారీ స్థాయిలో బూడిద వెలువడుతోంది. కాగా, ఈ బూడిద కారణంగా సౌదీ అరేబియా వాతావరణం ప్రభావితం కాలేదని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) తెలిపింది.
అధునాతన జాతీయ వ్యవస్థలను ఉపయోగించి కేంద్రం 24 గంటలూ బూడిద మేఘాల కదలికను పర్యవేక్షిస్తోందని NCM ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ అన్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు ప్రభావితమైతే అవసరమైన చర్యలు తీసుకుంటామని, పరిస్థితికి అనుగుణంగా కేంద్రం హెచ్చరికలు లేదా అప్డేట్ లను జారీ చేస్తూనే ఉంటుందని అల్-ఖహ్తానీ తెలిపారు.
హైలే గోబీ అగ్నిపర్వతం విస్ఫోటనం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ అగ్నిపర్వతం ఇథియోపియాలోని అఫర్ ప్రాంతంలో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో ఉంది. ఇది వేల సంవత్సరాలుగా నిద్రాణంగా ఉంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఆకాశంలోకి దట్టమైన బూడిద మేఘాలు ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం
- ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్...
- అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..
- డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు







