టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- November 25, 2025
మెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది.షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది.తొలి మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 7న పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. అదే రోజు ముంబై వేదికగా భారత్ యూఎస్ఏతో తలపడనుంది.
ఇక ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మ్యాచ్‌లు భారత్‌లోని 5 వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై).. శ్రీలంకలోని 3 వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి. 2024 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.
- ఫిబ్రవరి 7, 2026 – భారత్ వర్సెస్ USA (ముంబై)
- ఫిబ్రవరి 12, 2026 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
- ఫిబ్రవరి 15, 2026 – భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)
- ఫిబ్రవరి 18, 2026 – భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
గత ఎడిషన్ లో లానే ఈసారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని 4 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి.
షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత హిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
- గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా
- గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
- గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
- గ్రూప్ డి: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అప్ఘానిస్థాన్, కెనాడా, యూఏఈ
తాజా వార్తలు
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్







