రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- November 26, 2025
మనమా: బహ్రెయిన్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గత రోజుల్లో 169 మోటార్ బైక్స్ ను సీజ్ చేశారు. ఇందులో డెలివరీ సర్వీస్ వాహనాలు కూడా ఉన్నాయని ట్రాఫిక్ డైరెక్టరేట్ తెలిపింది.
ఉల్లంఘనల్లో అక్రమ పార్కింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, లేన్ డిసిప్లేన్ పాటించకపోవడం, అత్యవసర లేన్లలో డ్రైవింగ్ చేయడం, ఫుట్ బోర్డుల్లో డ్రైవింగ్ చేయడం వంటి నేరాలకు డ్రైవర్లు పాల్పడ్డారని తెలిపింది.
పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డైరేక్టరేట్ తెలిపింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు మరియు నియమాలను కచ్చితంగా పాటించి, సురక్షితంగా ఉండాలని డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!







