ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- November 26, 2025
మస్కట్: ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అదఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ బిన్ సయీద్ అల్ హజ్రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.ఈ ఎగ్జిబిషన్ లో ఆనాటి రాజ కుటుంబం ఉపయోగించిన వాహనాలతోపాటు, చారిత్రక నేపథ్యం ఉన్న వాటిని ఒకేచోట చూసే అవకాశం ఉందని ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ అల్ యఖ్ధాన్ అబ్దుల్లా అల్ హార్తీ తెలిపారు.
ఈ ప్రదర్శనలో క్లాసిక్, స్పోర్ట్స్ మరియు లగ్జరీ రాయల్ కార్ల విభిన్న కలెక్షన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్లు ఒమానీ చరిత్రను తెలియజేస్తాయని, ప్రత్యేక జాతీయ కోణాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్లను వాటి చారిత్రక విలువ మరియు అరుదైన వాటి ఆధారంగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.
అల్ బరాకా ప్యాలెస్‌లోని రాయల్ కార్స్ మ్యూజియంలో ఉన్న కొన్ని కార్లను కూడా ఇక్కడి ఎగ్జిబిషన్ లో చూడవచ్చని తెలిపారు. ఈ వింటేజ్ కార్ల ఎగ్జిబిషన్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతుందని, ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు సందర్శకులు రావచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







