తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు

- November 26, 2025 , by Maagulf
తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు

న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగం ఒకప్పుడు ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉండేది.నేడు పలు భాషల్లోకి అనువాదంగా వచ్చింది. తెలుగుభాషలో కూడా రాజ్యాంగం వచ్చింది. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో పలు భాషలు, సంస్కృతులు ఉన్న దేశం మనది. అందుకే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు సులువుగా అర్థం చేసుకునే రోజు వచ్చింది.

తాజాగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్ గా విడుదల చేశారు. తెలుగు భాష సహా మరాఠీ, మలయాళం, అస్సామీ, ఒడియా, కశ్మీరీ, జోడో, పంజాబీ, నేపాలీలలో రాజ్యాంగాన్ని అను వాదించారు. మనదేశ రాజ్యాంగ నిర్మాతలకు గౌరవం ఇచ్చే రోజు నేడు అని ముర్ము వారి సేవల్ని కొనియాడారు.

అతిపెద్ద రాజ్యాంగం మనదే
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానిది. ఇందులో 26భాగాలు, 12 షెడ్యూళ్లు 448 అధికరణలు ఉన్నాయి. రాజ్యాంగం ఇంగ్లీషు ప్రతిలో దాదాపు1,17,369 పదాలున్నాయి. ఇంగ్లీషు, హిందీ రెండు కాపీలు చేతితోనే రాశారు. హిందీ, ఇంగ్లీషులో రాసిన రాజ్యాంగం అసలు కాపీలు హీలియంతో నింపిన ప్రత్యేకమైన విధానంలో పార్లమెంట్ లైబ్రరీలో భద్రపరిచారు. రాజ్యాంగ ప్రతులను ప్రేమ్ బిహరీ నారాయణ అనే వ్యక్తి ఇటాలిక్ శైలిలో అందంగా రాశారు. ఇందుకోసం ఆయన ఆరునెలల సమయాన్ని వెచ్చించి దాదాపు 254 పాళీలు ఉపయోగించారు.

ఇందుకు ప్రతిఫలంగా ఏమి తీసుకోని ప్రేమ్ బిహారీ కేవలం తన పేరును ప్రతిపేజీలో ఉండేలా కోరారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అందుకే నవంబర్ 26న రాజ్యాంగ దినోత్స వంగా పరిగణిస్తారు. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా భారత్ అవతరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com