పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్‌డి అప్‌లోడ్

- November 26, 2025 , by Maagulf
పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్‌డి అప్‌లోడ్

హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో పరిస్థితులు అనూహ్యంగా మారాయి. రవి నేరుగా సినిమాలను పైరసీ చేయలేదని, వాటిని కొనుగోలు చేసి ఐబొమ్మ సైట్‌లో అప్‌లోడ్‌ చేసేవారని పోలీసులు వెల్లడించారు. సినిమా పైరసీ, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, కాపీరైట్ ఉల్లంఘన, మనీలాండరింగ్‌ వంటి పలు ఆరోపణలతో అరెస్ట్ అయిన రవిని విచారించిన సమయంలో అనేక కీలక వివరాలు బయటపడ్డాయి.

సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలను రవి తన స్వంత వివరాలు, ఈమెయిల్‌ ఐడీని ఉపయోగించి ఎన్‌జిలా అనే కంపెనీ ద్వారా డొమైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఐపీ వాల్యూమ్ హోస్టింగ్‌ తీసుకుని, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసి వాటిని హెచ్‌డీ క్వాలిటీకి మార్చి అప్‌లోడ్‌ చేసేవాడని విచారణలో తెలిసింది. ఐబొమ్మ పోస్టర్లు అతని స్నేహితుడు నిఖిల్ డిజైన్‌ చేసేవాడని పోలీసులు గుర్తించారు.

బెట్టింగ్‌, గేమింగ్ యాప్స్‌కు సంబంధించిన

సైట్‌ను ఓపెన్ చేసే వినియోగదారులు ముందుగా ‘టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించాలి. ఒకసారి అంగీకరించిన తరువాత బెట్టింగ్‌, గేమింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు తప్పనిసరిగా చూపబడతాయి. వీటిని లక్షల సంఖ్యలో ప్రజలు చూసే కారణంగా రవికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది. సంపాదించిన దాదాపు రూ.20 కోట్లలో రవి రూ.17 కోట్లు విలాస యాత్రలకు ఖర్చు చేసినట్లు సమాచారం. మిగిలిన రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌ మరియు విశాఖలోని ఆస్తులను కూడా సీజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com