ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్

- November 26, 2025 , by Maagulf
ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రాడిల్‌ మిచెల్‌ను అధిగమించి నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచుల్లో రేటింగ్‌ పాయింట్లు తగ్గడంతో రాడిల్‌ ర్యాంకు దిగజారింది. త్వరలోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న క్రమంలోనే రోహిత్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

రోహిత్ నంబర్ వన్ స్థానాకి చేరుకోవడంతో టీమిండియా అభిమానులు జట్టుకు శుభ సంకేతంగా భావిస్తున్నారు. ఇక ర్యాంకుల్లో (ICC Rankings) టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ 4వ స్థానంలో, విరాట్‌ కోహ్లీ 5వ స్థానంలో, శ్రేయాస్‌ అయ్యర్‌ ఒక ర్యాంకు దిగజారి 9వ స్థానానికి చేరుకున్నాడు.మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్‌ ఇతర ప్లేయర్స్‌ రాణించారు.

రచిన్ రవీంద్ర ఒక స్థానం ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నారు. డెవాన్ కాన్వే 11 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తన అజేయ సెంచరీతో ర్యాంకింగ్స్‌లో ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్లలో మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీల అద్భుత ప్రదర్శన చేయడంతో ర్యాంకులు పెరిగాయి.

ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ సికందర్ రజా
శాంట్నర్‌ 6వ స్థానం, హెన్ని 10వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వే స్టార్ ఆటగాడు సికందర్ రజా తొలిసారిగా టీ20 అంతర్జాతీయ ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకొని చరిత్ర సృష్టించాడు. ట్రై-సిరీస్‌లో అతని ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

టెస్టుల్లో బౌలర్స్‌, ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో ర్యాంకులు మారాయి.ఇంగ్లండ్‌కు చెందిన ఓలీ పోప్ ఇప్పుడు 24వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన తైజుల్ ఇస్లాం 15వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ బౌలర్లలో 5వ స్థానానికి ఎగబాకాడు.

బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ
ఆల్ రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ రెండవ స్థానానికి చేరగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో చెందిన రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల రోహిత్‌ శర్మ కు అరుదైన గౌరవం దక్కింది. రాబోయే టీ20 ప్రపంచ కప్-2026కి ఐసీసీ అతన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

ఈ టోర్నమెంట్ భారత్‌-శ్రీలంక వేదికగా జరుగనున్నది. రోహిత్ ఇప్పటివరకు తొమ్మిది టీ20 ప్రపంచ కప్‌లలో ఆడాడు. ఇందులో 2024లో టీమిండియా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 47 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో 1,220 పరుగులు చేసిన రోహిత్ ఈ కొత్త పాత్ర పోషించనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com