మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- November 26, 2025
యూఏఈ: మరణించిన బంధువుల ఫోటోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో బహిరంగంగా షేర్ చేస్తున్నారా? అయితే, మీరు భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.ఇలాంటి చర్యలు బాధిత కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు ఇబ్బందులు కలుగుజేస్తాయని, వారి మనసులను బాధిస్తాయని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటువంటి చర్యలు గౌరవం, గోప్యతను ఉల్లంఘించడమే కాకుండా అధికారిక దర్యాప్తులకు ఆటంకం కలిగిస్తాయని, బాధిత కుటుంబ సభ్యుల గాయాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని తెలిపారు.
మరణించిన వారి, ప్రమాద బాధితుల లేదా దుఃఖిస్తున్న కుటుంబాల ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేయడం అనైతికమే కాకుండా, జైలు శిక్ష, భారీ జరిమానాలు మరియు ఇతర శిక్షలకు దారితీసే క్రిమినల్ నేరంగా పరిగణిస్తారని యూఏఈలోని చట్టపరమైన మరియు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమాధులు, అంత్యక్రియలు, ప్రమాద దృశ్యాలు లేదా ఆసుపత్రి అత్యవసర గదుల నుండి సున్నితమైన విజువల్ ఫోటోలను తరచుగా కుటుంబానికి తెలియకుండా లేదా అనుమతి లేకుండా ఆన్లైన్లో పోస్ట్ చేయడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ హెచ్చరికలను జారీ చేశారు.
సైబర్ క్రైమ్పై 2021 నాటి ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 ప్రకారం.. వ్యక్తుల అనుమతి లేకుండా లేదా మరణించిన వారి బంధువుల సమ్మతి లేకుండా వారి ఫోటోలను పోస్ట్ చేయడం చట్టం ఖచ్చితంగా నిషేధిస్తుంది. సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం, ఉల్లంఘనలకు Dh150,000 మరియు Dh500,000 మధ్య జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఈ చర్య ప్రజా క్రమశిక్షణకు హానికరమని భావిస్తే అటువంటి నేరాలకు పాల్పడిన ప్రవాసులను దేశం నుంచి బహిష్కరిస్తారని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







