అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!

- November 26, 2025 , by Maagulf
అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!

కువైట్: కువైట్ లో ట్రాఫిక్  రద్దీని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి మరియు రహదారి సామర్థ్యాన్ని పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలను ముబారక్ అల్-కబీర్ గవర్నర్ , హవల్లి యాక్టింగ్ గవర్నర్ షేక్ సబా అల్-బదర్ సమీక్షించారు. ముఖ్యంగా ఆరవ రింగ్ రోడ్‌లోని అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.

ఫీల్డ్ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో..రెండు గవర్నరేట్‌లలో వాహనాల రద్దీని తగ్గించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ, ప్రజా పనుల మంత్రిత్వ శాఖ మరియు కువైట్ మునిసిపాలిటీ ఇంజనీర్లు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముబారక్ అల్-కబీర్ మరియు హవల్లి ప్రాంతాలలో ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడానికి నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సమగ్ర ప్రణాళిక ప్యాకేజీతో అమలు చేస్తామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com