ఐ బొమ్మ రవి బయోపిక్ అనౌన్స్..
- November 26, 2025
గత కొన్ని రోజులుగా ఐ బొమ్మ వెబ్ సైట్, దాని నిర్వాహకుడు రవి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐ బొమ్మలో పైరసీ సినిమాలు చూపించి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి.పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ చేయడంతో పోలీసులు ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసారు.
ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పలువురు దాంట్లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నామని అతన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ విచారణలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఐ బొమ్మతో జనాలను బెట్టింగ్ యాప్స్ కి తరలించడం, మన డేటాను తీసుకొని డార్క్ వెబ్ కి అమ్మడం, హవాలా చేయడం..లాంటి ఇల్లీగల్ పనులతో కోట్లు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు.
ఇటీవల హీరోల కంటే ఎక్కువగా విలన్స్ బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు గొప్పగొప్ప వాళ్ళ బయోపిక్స్ చేస్తే ఇపుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్ళను, స్మగ్లింగ్ చేసేవాళ్లను.. ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళ జీవిత కథలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేసే స్థాయికి దిగజారారు.ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ రవి బయోపిక్ కూడా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
అయితే జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకొని వస్తారు, అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా, ఆ సినిమా కూడా పైరసీనే చూస్తాము అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ఐ బొమ్మ రవి బయోపిక్ ఐ రవి ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో చూడాలి. ఐ బొమ్మ ఇమ్మడి రవి లైఫ్, అతని ఫ్యామిలీ ఆటుపోట్లు, ఐ బొమ్మని ఎలా మొదలుపెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్.. ఇలాంటి అంశాలతో ఐ బొమ్మ రవి బయోపిక్ ని సినిమాగా తెరకెక్కిస్తారట.
తాజా వార్తలు
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్







