పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈలో అనాథ పిల్లలను పోషించడానికి అర్హతను సవరించారు. ఎమిరాటీలు మరియు నివాసితులు ఇద్దరికి వర్తించేలా కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు. 2025 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 12 ప్రకారం.. తల్లిదండ్రులు తెలియని పిల్లల సంరక్షణను నియంత్రించే 2022 చట్టంలోని కీలక నిబంధనలను సవరించారు.
సవరించిన ఆర్టికల్ 6 ప్రకారం.. పిల్లలను పెంచడానికి భార్యాభర్తలు యూఏఈలో రెసిడెన్సీ కలిగి ఉండాలి. కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి నేరారోపణలు ఉండకూడదు. పిల్లలను ప్రభావితం చేసేలా వ్యాధులు లేదా మానసిక సమస్యలు ఉండకూడదు. పిల్లలను పోషించడానికి తగిన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించాలి.
ఇక ఒంటరి మహిళల అర్హత పరంగా చూస్తూ.. ఒంటరి మహిళ తప్పనిసరిగా యూఏఈలో నివసిస్తు ఉండాలి. అవివాహితురాలు లేదా విడాకులు తీసుకున్న, వితంతువు అయినా ఫర్వలేదు. కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎటువంటి నేరారోపణలు ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలను పెంచే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి చట్ట ప్రకారం కస్టడీ బాధ్యతలను ఉపసంహరిస్తారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి







