విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్

- November 27, 2025 , by Maagulf
విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్

విజయవాడ–బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఈ నెల డిసెంబర్ 10న ప్రారంభం అయ్యే, అవకాశం ఉంది. ప్రారంభ తేదీ పై తుది ధృవీకరణ త్వరలో రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రధానంగా విజయవాడ–తిరుపతి–బెంగళూరు మార్గంలో నడుస్తూ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య త్వరితగతి రవాణాకు మార్గం సుగమం చేయనుంది.

ఈ రైలు సేవలను ప్రారంభించడానికి రైల్వే అధికారులు ప్రస్తుతం టైమ్ టేబుల్, సాంకేతిక తనిఖీలను పూర్తిచేస్తున్నారు. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, రైలు ఉదయం 5:15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1:15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అంటే ఇప్పటివరకు 9-10 గంటలు పడుతున్న ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గనుంది.

ప్రత్యేకించి తిరుపతి మీదుగా నడుస్తుండటం ఈ సేవకు మరింత ప్రాధాన్యత తెచ్చిపెడుతోంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి రోజు లక్షలాది మంది యాత్రికులు ప్రయాణిస్తారు.ఈ కొత్త రైలు సేవ వారికీ సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com