జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- November 27, 2025
తిరుమల: వైఖానస ఆగమోక్తంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలను సామాన్యభక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వెల్లడించారు.పదిరోజుల దర్శనాల్లో మొదటి మూడురోజులు (డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1) మినహా మిగిలిన ఏడురోజులు టోకన్లు, టిక్కెట్లు లేకున్నా దర్శనాలకు రావచ్చని సామాన్యభక్తులకు పిలుపునిచ్చారు.ఏడు రోజులు ఆ వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8
బుధవారం ఉదయం తిరుమలలోని ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్ ఒ నీలిమతో కలసి ఛైర్మన్ నాయుడు మీడియాప్రతినిధులతో మాట్లాడారు.డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8 వరకు ఎంతో గొప్ప కార్యక్రమం జరుగనుందన్నారు. మొదటి మూడురోజులూ ఆన్లైన్ ద్వారా టోక్లను బుక్చేసుకున్న వారికి మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు.182 గంటల్లో 164గంటలు సామాన్యభక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
10గంటలకు శ్రీవాణి టిక్కెట్ కోటా
జనవరి 2నుండి 8వరకు ఎస్ఇ డి రోజుకు 15వేల టిక్కెట్లు, శ్రీవాణి రోజుకు వెయ్యిటిక్కెట్లు ఆన్లైన్లో జారీచేస్తామన్నారు.డిసెంబర్ 5వతేదీ ఉదయం 10గంటలకు శ్రీవాణి టిక్కెట్ కోటా, మధ్యాహ్నం 3గంటలకు ఎస్ డి 300 రూపాయలు దర్శన కోటా విడుదల చేస్తామన్నారు. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు జనవరి 6,7,8 తేదీలకు రోజుకు ఐదువేల టోకన్లు ఆన్లైన్లో జారీచేయడం జరుగుతుందన్నారు.డిసెంబర్ 10వతేదీ స్థానికుల దర్శన కోటా విడుదలవుతుందన్నారు.
భక్తులు టిటిడి సూచనలు పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని బి.ఆర్ నాయుడు విజప్తి చేశారు.వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి మొదటిమూడురోజులు డిసెంబర్ 30,31, 2026 జనవరి 1వతేదీ దర్శన టోకెన్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే టిటిడి టోకెన్లు జారీచేస్తుంది.నేటి నుండి ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 1వతేదీ వరకు అవకాశం కల్పించింది.జనవరి 2వ తేదీ నుండి 8 వరకు పూర్తిగా ఎలాంటి టోకెన్లు.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్







