సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- November 27, 2025
కువైట్: సహకార సంఘాలను ప్రైవేటీకరించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందనే పుకార్లను సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహకార వ్యవహారాల డైరెక్టర్ జనరల్ అథారి అల్-మాట్రౌక్ ఖండించారు. అలాంటి వాదనలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఆహార భద్రతను నిర్ధారించడంలో సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ వాటికి మద్దతు మరియు పర్యవేక్షణను కొనసాగిస్తుందని తెలిపారు.
రావ్డా మరియు హవల్లీ సహకార సంఘం కొత్తగా పునరుద్ధరించిన కేంద్ర మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక, కుటుంబ మరియు బాల్య వ్యవహారాల మంత్రి డాక్టర్ అమ్తాల్ అల్-హువైలా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. సహకార రంగానికి మంత్రిత్వ శాఖ మద్దతు కొనసాగుతుందని అల్-మాట్రౌక్ తెలిపారు. మంత్రి అల్-హువైలా కువైట్ సహకార వ్యవస్థను బలోపేతం చేసే చొరవలకు మద్దతు ఇస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. కువైట్ సహకార నమూనాను ఇప్పుడు అనేక గల్ఫ్ మరియు అరబ్ దేశాలు అధ్యయనం చేసి, అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







