సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్‌ఎంసీ సమన్వయ సమావేశం

- November 28, 2025 , by Maagulf
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్‌ఎంసీ సమన్వయ సమావేశం

హైదరాబాద్: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి–చార్మినార్ జోన్ల మధ్య సంయుక్త సమన్వయ సమావేశం ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జరిగింది. 

ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా.గజరావు భూపాల్, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ హేమంత్ భోర్ఖడే, జాయింట్ కమిషనర్ వి.ప్రశాంతి, ప్రాజెక్ట్ ఇంజినీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య, పాదచారుల భద్రత, నీటిముంపు సమస్యలు, రోడ్ల అభివృద్ధి, సిగ్నల్ వ్యవస్థల మెరుగుదలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రధాన జంక్షన్ల వద్ద అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, స్కైవాక్‌లు, ఫుట్‌పాత్‌లు నిర్మించడం, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను వేగవంతం చేయడం, డ్రైనేజి వ్యవస్థను బలోపేతం చేయడం వంటి  అంశాలపై చర్చించారు.

అలాగే పాదచారులు, ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ప్రత్యేక సర్వీస్ రోడ్లు, రక్షిత క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.రాబోయే కెఎన్ఆర్ ప్రాజెక్టుల కారణంగా ఐఐటి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌పై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని అధికారులు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి సాయి మనోహర్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీలు రంజన్ రతన్ కుమార్, ఏసీపీలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com