ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- November 28, 2025
చైనాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.పట్టాల పై పనులు చేస్తున్న రైల్వే కార్మికుల పైకి రైలు దూసుకెళ్లింది.ఈ దుర్ఘటనలో 11 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
యున్నాన్ ప్రావిన్స్ లో ఈ ఘోర రైలు ప్రమాదం జరిగింది. భూకంప పరికరాల పరీక్ష కోసం ఉపయోగించే టెస్టింగ్ ట్రైన్ కున్మింగ్‌లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్‌లో ప్రయాణించింది. వంపుగా ఉన్న రైలు పట్టాల వద్ద కొందరు కార్మికులు పని చేస్తున్నారు. పట్టాలు తప్పిన టెస్టింగ్ ట్రైన్ రైలు ట్రాక్ పై పని చేస్తున్న రైల్వే సిబ్బందిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాద ఘటన పై అధికారులు విచారణ చేపట్టారు.
కాగా, గత పదేళ్ల కాలంలో చైనాలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అతి పెద్దది. 2011లో చివరిసారిగా భారీ రైలు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 40 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
చైనా రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దది.ఇది 1,60,000 కిలోమీటర్ల (1,00,000 మైళ్ళు) కంటే ఎక్కువ విస్తరించి ఉంది.ఇక, 2021లో వాయువ్య ప్రావిన్స్ లో కార్మికులపైకి రైలు దూసుకెళ్లడంతో 9మంది మరణించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







