సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- November 28, 2025
రాస్ అల్ ఖైమా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందించే అత్యంత అరుదైన ప్రతిష్ఠాత్మక గౌరవాలలో ఒకటైన ‘యూఏఈ గోల్డెన్ విసా’ను ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఛైర్మన్ సందీప్ మక్తాల అందుకున్నారు.
రాస్ అల్ ఖైమా రాజభవనం మద్దతుతో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు టెక్ లీడర్ సందీప్ మక్తాల కావడం విశేషం.ఇది కేవలం ఒక వీసా కాదు, సాంకేతికత, ఆవిష్కరణలు మరియు ప్రపంచ శాంతికి ఆయన చేస్తున్న అద్భుతమైన సేవలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు.
ఈ ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల రెసిడెన్సీ వీసా ఏ విధమైన పెట్టుబడి అవసరం లేకుండానే ప్రకటించబడింది. యూఏఈ ప్రభుత్వం అన్ని వీసా సంబంధిత ఖర్చులను సంపూర్ణంగా భరించడం ద్వారా, మక్తాలా ప్రపంచ స్థాయి సేవలను గుర్తించింది.
2019లో ప్రవేశపెట్టబడిన యూఏఈ గోల్డెన్ విసా, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దీర్ఘకాల గౌరవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.ప్రపంచ స్థాయి ప్రభావం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ గుర్తింపు అందజేయబడుతుంది.ఎటువంటి పెట్టుబడి లేకుండా, పూర్తిగా ప్రతిభ ఆధారంగా ఈ విసాను పొందడం మక్తాలాను అత్యంత అరుదైన వర్గంలో నిలిపింది.
గౌరవానికి ప్రతీకగా, యూఏఈ మక్తాలా కుటుంబానికి మొత్తం గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఇందులో ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఉండటం విశేషం.కుటుంబం ప్రతిబింబించే విలువలు మరియు ప్రపంచ దృష్టికోణం గుర్తిస్తూ ఈ గౌరవాన్ని యూఏఈ అందించింది.
టెక్నాలజీ, ఆవిష్కరణల దౌత్యం, వ్యవస్థాపకత మరియు ప్రపంచ శాంతి చొరవల కార్యక్రమాల విభాగాల్లో మక్తాలా చేస్తున్న విశిష్ట సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTIC) చైర్మన్గా 63 దేశాలలోని 2,843 కంపెనీలను ప్రతినిధ్యం వహిస్తున్నారు.టిఐటిఏ గ్లోబల్ ప్రెసిడెంట్గా సేవలందిస్తూ, టీ కన్సల్ట్ మరియు తన మధ్యప్రాచ్య విస్తరణ మిషన్ ఎక్స్ పాన్ట్ ఎంఈ ద్వారా సరిహద్దులను దాటి ఇన్నోవేషన్కు తోడ్పడ్డారు. నోబెల్ పురస్కార గ్రహీతలు మద్దతు తెలిపిన ఆయన సైబర్ సత్యాగ్రహ పీస్ మిషన్ నైతిక సాంకేతికత మరియు శాంతి నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావం వెలుగులోకి తెచ్చింది.
సందీప్ మక్తాల ఇప్పటి వరకు 63 దేశాల్లోని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు.ఇందులో ఐక్యరాజ్యసమితి వేదిక, మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ప్రపంచ సదస్సు వంటి ప్రతిష్ఠాత్మక వేదికలు ఉన్నాయి.అలాగే, భారత ప్రధాని మోదీ, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం కార్లోస్ స్లిమ్ వంటి నేతల నుండి కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈ ప్యాలెస్-ఎండోర్స్డ్ గోల్డెన్ విసా అసాధారణ విశ్వాసానికి ప్రతీకగా నిలిచి, మక్తాలాను ఇన్నోవేషన్, శాంతి మరియు సహకారానికి గ్లోబల్ అంబాసడర్గా ప్రతిష్ఠిస్తోంది.ఇది యూఏఈ యొక్క ముందడుగు దృష్టికోణంతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







