సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- November 28, 2025
హైదరాబాద్: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి–చార్మినార్ జోన్ల మధ్య సంయుక్త సమన్వయ సమావేశం ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జరిగింది.
ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా.గజరావు భూపాల్, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ హేమంత్ భోర్ఖడే, జాయింట్ కమిషనర్ వి.ప్రశాంతి, ప్రాజెక్ట్ ఇంజినీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య, పాదచారుల భద్రత, నీటిముంపు సమస్యలు, రోడ్ల అభివృద్ధి, సిగ్నల్ వ్యవస్థల మెరుగుదలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రధాన జంక్షన్ల వద్ద అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, స్కైవాక్‌లు, ఫుట్‌పాత్‌లు నిర్మించడం, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను వేగవంతం చేయడం, డ్రైనేజి వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
అలాగే పాదచారులు, ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ప్రత్యేక సర్వీస్ రోడ్లు, రక్షిత క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.రాబోయే కెఎన్ఆర్ ప్రాజెక్టుల కారణంగా ఐఐటి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌పై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని అధికారులు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి సాయి మనోహర్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీలు రంజన్ రతన్ కుమార్, ఏసీపీలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







