కాల్పులు ఉగ్రవాదచర్య కాదు: ఫ్లోరిడా

- July 25, 2016 , by Maagulf
కాల్పులు ఉగ్రవాదచర్య కాదు: ఫ్లోరిడా

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఉగ్రవాద ఛాయలు ఏమీ కనిపించలేదని పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లోని బ్లూబార్‌ అండ్‌ గ్రిల్‌ క్లబ్‌లో కాల్పులు జరగడంతో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. మరో 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అయితే వారి వివరాలు, పేర్లు ఏవీ వెల్లడించలేదు. నైట్‌ క్లబ్‌లో టీనేజీ పిల్లల పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో అంతా 12 నుంచి 27ఏళ్ల లోపు వారు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com