ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- November 28, 2025
మనామాః ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలికను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన 46 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ ఇంటిరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. సమాచారం అందగానే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొంది.
తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని సైబర్‌స్పేస్‌లో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పిలుపునిచ్చింది. సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి వారికి అవగాహన కల్పించాలని సూచించింది. తల్లిదండ్రులు తమ పిల్లలు యాక్సెస్ చేసే కంటెంట్ ను గమనించాలని, ఏవైనా బెదిరింపులు ఎదురైతే స్పందించాల్సిన విషయాలపై వారికి అవగాహన కల్పించాలని కోరింది.
పిల్లల భద్రతకు హాని కలిగించే అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలను స్వయంగా గాని, లేదంటే 33523300కు డైరెక్ట్ హాట్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే, జనరల్ డైరెక్టరేట్ హాట్‌లైన్ 992ని సంప్రదించడం ద్వారా కూడా నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!







