ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- November 28, 2025
న్యూ ఢిల్లీ: టీ20 ప్రపంచకప్ గెలిచిన, భారత అంధుల క్రికెట్ జట్టు గురువారం న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. భారత జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆటోగ్రాఫ్స్ చేసిన బ్యాట్‌ను ఈ సందర్భంగా భారత్ బృందం ప్రధానికి బహుమతిగా అందజేసింది.
దీపిక టి.సి. సారథ్యంలోని భారత జట్టు, ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన ఫులా సరెన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి.
క్రీడాకారిణులకు స్వీట్లు పంచిపెట్టి వారిని సత్కరించారు. మోదీ కూడా ఒక క్రికెట్ బంతిపై సంతకం చేసి వారికి తిరిగి బహుకరించారు. ప్రతి క్రీడాకారిణితోనూ ఆయన ఫోటోలు దిగి, వారి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు, భారత జట్టు విజయంపై ట్విట్టర్ (X) వేదికగా ప్రధాని స్పందించారు. “అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఈ సిరీస్‌లో అజేయంగా నిలవడం మరింత గర్వకారణం. మీ కఠోర శ్రమ, టీమ్ వర్క్, పట్టుదల భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం” అని మోదీ కొనియాడారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!







