బహ్రెయిన్‌లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!

- November 28, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!

మనామా: గత రెండు సంవత్సరాలలో బహ్రెయిన్‌లో ఎనిమిది లైసెన్స్ లేని ఇల్లీగల్  హెల్త్ సైట్స్ మరియు 56 లైసెన్స్ లేని మెడికల్ ప్రాక్టీషనర్లు ఆరోగ్య సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు.అన్ని కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు హెల్త్ అథారిటీలు పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

ఈ మేరకు ఎంపీ అలీ సఖర్ అల్ దోసారికి పంపిన సమాధానంలో జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ (NHRA) తెలిపింది.  బహ్రెయిన్ లో 'లైసెన్స్ లేని క్లినిక్‌లు' లేవని, ఆరోగ్య సంబంధిత సేవలను అందించడానికి ఉపయోగపడుతున్న క్లినిక్ లు మాత్రమే ఉన్నాయని సమాధానంలో స్పష్టం చేశారు.  

మరోవైపు, లైసెన్స్ పొందిన ప్రొఫెసర్స్ పై రోగులు, కుటుంబాలు మరియు న్యాయ సంస్థలు సమర్పించిన ఫిర్యాదులు, నివేదికల ద్వారా వైద్య లోపాలు, ఇతర హానిని ట్రాక్ చేస్తామని అథారిటీ తెలిపింది. ఈ ఫైళ్లు NHRAలోని ప్రత్యేక సాంకేతిక కమిటీలకు వెళ్తాయి. ఇవి వృత్తిపరమైన మరియు నైతిక ఉల్లంఘనలను పరిశీలిస్తాయి. అనంతరం తగిన చర్యలను సిఫార్సు చేస్తాయని అన్నారు అల్ దోసారి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com