షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!

- November 28, 2025 , by Maagulf
షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!

కువైట్: కువైట్ మునిసిపాలిటీ మరియు అల్-షాబ్ నేషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీ సహకారంతో షార్క్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నిర్మాణ స్థలాన్ని నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సందర్శించింది. ఈ ప్రాజెక్టులో 12వేల చదరపు మీటర్ల భూమి, సుమారు KD 7 మిలియన్ల విలువ కలిగిన మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ ను పరిశీలించారు.   

ఇందులో దాదాపు 5,900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలాలు నిర్మిస్తున్నారు. కార్ పార్కింగ్ భవనంలో ఐదు పై అంతస్తులతో పాటు బేస్‌మెంట్ మరియు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి 12 ప్రాంతాలు సహా సుమారు పర్యావరణ ధోరణులకు అనుగుణంగా 1,175 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏటా 500 మెగావాట్ల వరకు విద్యుత్తును పర్యావరణ ధోరణులకు అనుగుణంగాఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు.      

ఈ ప్రాజెక్ట్ రాజధాని మధ్యలో ఒక విలక్షణమైన కీలక అడుగుగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వైస్ చైర్మన్,  గ్రూప్ సీఈఓ ఇసామ్ అల్-సాగర్ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. ఇది అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించే ఆచరణాత్మక చొరవల ద్వారా కువైట్ అభివృద్ధి దృక్పథానికి మద్దతు ఇవ్వడానికి NBK నిబద్ధతతో కృషి చేస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com